Telugu Society of America (TELSA)

1000 ఉచిత సైకిళ్ళ పంపిణీ: దరఖాస్తుకు ఆహ్వానం:Program Ended June 30, 2010 Print E-mail
ఉచిత సైకిళ్ళ పంపిణీతెల్సా (TELSA) 2010 వ సంవత్సరంలో గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకి 1000 సైకిళ్ళు ఉచితంగా ఇవ్వాలని తీర్మానించింది. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులనించి మేము (తెల్సా కార్యవర్గ సభ్యులు) దరఖాస్తులని ఆహ్వానిస్తున్నాం. జూన్ 30 న గడువు ముగిసినందువల్ల ఇక దరఖాస్తులు స్వీకరించబడవు.

జూన్ 30 న గడువు ముగిసినందువల్ల ఇక దరఖాస్తులు స్వీకరించబడవు.
ఉచిత సైకిళ్ళ పంపిణీ

తెల్సా (TELSA) 2010 వ సంవత్సరంలో గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకి 1000 సైకిళ్ళు ఉచితంగా ఇవ్వాలని తీర్మానించింది. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులనించి మేము (తెల్సా కార్యవర్గ సభ్యులు) దరఖాస్తులని ఆహ్వానిస్తున్నాం. సైకిళ్ళ పంపిణీకయే నిధులు తెల్సా 2009, 2008 లలో  జరిపిన పాదయాత్రల ద్వారానూ, చిల్లర డబ్బులు పోగుచేయడం ద్వారానూ వచ్చిన విరాళాల రూపేణ సేకరించాము. జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని, క్రింద సూచించిన అన్ని నిబంధనలనీ పాటిస్తూ, దరఖాస్తుని నింపి, June 15-June 30, 2010లోపున  చేరేలాగ పంపాలి. సైకిళ్ళు మంజూరు చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి మా నిర్ణయం ఫోను లేదా ఈ మెయిలు ద్వారా  తెలియచేసి, సైకిళ్ళ ఖరీదు బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా పంపుతాము. తరువాత  పాఠశాలలు సైకిళ్ళు కొని, వాటిని తెల్సా ప్రతినిధి సమక్షంలో  నిరాడంబరమైన కార్యక్రమంలో పంపిణీ చేయాలి.

దరఖాస్తులు పంపించ వలసిన చిరునామా

తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా
C/O రెసిడెంట్ కోఆర్డినేటర్
11-13-108, రోడ్ నంబర్ 2
అలకా పురి
హైదరాబాద్ - 500 035, ఆంధ్ర ప్రదేశ్

దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోండి. (Download application form)

తెల్సా (TELSA) అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ.                 

గ్రామాలకు సంబంధించి తెల్సా లక్ష్యాలు

  1. గ్రామాలన్నీ, నిర్ణీత కాలంలో ప్రణాళికా బద్ధంగా ఎదగాలి.
  2. ఆ అభివృద్ధి, చదువుకున్నవారు సైతం గ్రామాలు వదిలిపోనవసరం లేకుండా ఆధునిక రంగాలలో కూడా ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా వుండాలి.
  3. ఆధునిక జీవనానికి అవసరమైన వసతులన్నీ గ్రామాలలో కూడా రూపొందాలి.
  4. గ్రామ పాఠశాలల్లో, శక్తివంచన లేకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, దాతృత్వ ప్రణాళికలు  చేపట్టాలి.

 

నియమ నిబంధనలు (అన్నిటినీ పాటించాలి)

  1. పాఠశాలలే నేరుగా తెల్సాకి దరఖాస్తులు పంపాలి. మధ్యవర్తులూ, మధ్యవర్తి సంస్థలూ పాఠశాలల తరఫున పంపకూడదు.
  2. గ్రామాలలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకి మాత్రమే ఈ అవకాశం.
  3. పాఠశాలకి 20 సైకిళ్ళ చొప్పున మొత్తం 50 పాఠశాలలకి (జిల్లాకి రెండు పాఠశాలలకి మించకుండా) మొత్తం 1000 సైకిళ్ళు ఇవ్వదలచాం. వనరులని బట్టి సైకిళ్ళ సంఖ్యగానీ, పాఠశాలల సంఖ్య గానీ మారవచ్చు.
  4. ప్రతి దరఖాస్తుతోబాటు, మీ ఊరి నుండిగాని, దగ్గర పట్నం నుండి గానీ కనీసం ముగ్గురు సైకిల్ వ్యాపారుల దగ్గరినించి (కొత్తవి, నాణ్యమైన భాగాలతో వచ్చే సైకిళ్ళ) కొటేషన్లు తీసుకుని జతచేయాలి. తెల్సా 2009లో పంపిణీ చేసిన సైకిలు విలువ సగటున రూ. 2500 ఉంది. అసాధారణ పరిస్థితులలో తప్ప ఇప్పుడు కూడా అదే పరిమితి ఉంటుంది.
  5. ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థుల ఎంపికలో, ప్రస్తుతం సైకిళ్ళు లేనివారిని, ఆ విద్యార్థులకిగల అవసరం, ప్రతిభ, స్కూలుకు కనీసం ఒక కిలోమీటరు దూరంగానైనా వుండటం వంటివి అర్హతలుగా పెట్టుకుని ఎంచుకోవాలి.
  6. విద్యార్థుల, పాఠశాలల నిర్ణయం విషయంలో మాతో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
  7. సైకిళ్ళపై మా చిహ్నంతో పాటు, మేం ఇచ్చిన సంగతి, విద్యార్థి పేరు వ్రాయించవలసి వుంటుంది
  8.  సైకిలు అందుకున్న ప్రతి విద్యార్థి, దాన్ని కనీసం మూడేళ్ళయినా వాడుకుంటానని, ఆ లోగా అమ్మబోనని, జాగ్రత్తగా చూసుకుంటానని హామీ పత్రం వ్రాసి పంపాలి.  ప్రధానోపాధ్యాయులు తాము ఎంపిక చేసే వారిలో, చిన్న తరగతుల వారికి ఎక్కువ ప్రాధాన్యత  ఇవ్వడం ద్వారా మూడేళ్ళు వాడాలనే నిబంధనను పాటించడం సుళువవుతుంది.
  9. పూర్తి సమాచారం లేకపోతే దరఖాస్తులు పరిశీలించడం కష్టం అవుతుంది.
  10. పాఠశాలలు సైకిళ్ళ పంపిణీ మేం సూచించబోయే నాటికి పూర్తి చేయాలి.
  11. పాఠశాలలు సైకిళ్ళ పంపిణీకి నిరాడంబరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. మేం సూచించబోయే మా ప్రతినిధితో సంప్రదించి వారికి కూడా వీలైన సమయం ఎంచుకోవాలి. పంపిణీకి చేసిన ఏర్పాట్లకయ్యే ఖర్చు స్కూలు వారే పెట్టుకోవాలి.
 

2010 Bikes Program

Beneficiaries

This We Believe ..

This we believe ..

 Want to stop distress migrations?
End distress in the world’s villages! 

.. we are sure you do too.

Donate for Bicycle Project 2011

Donate for
You are here  : Home TELSA Projects Free Bicycles

నిత్యావసరాల కోసం
పెనుగులాడాల్సిన వాళ్ళు
కృత్యాకృత్య మీమాంసతో
పెనుగులాడ లేని వాళ్ళు