Telugu Society of America (TELSA)

తెలుగు సదస్సు

జూలై 9, 2011 నాడు "బ్రియా కమ్యూనిటీ సెంటర్లో" తెలుగు సదస్సు జరుగుతుంది. తెలుగుదనపు పరిణామ క్రమం, తెలుగుసాహిత్యం,ఇక్కడ మనపిల్లలకు తెలుగు నేర్పించటం వంటి అంశాలపై భాషావేత్తలు,కవులు,రచయితలు ప్రసంగిస్తారు. చర్చావేదికలు నిర్వహిస్తారు.చర్చలలోమీరుకూడా గొంతుకలిపి మీఅనుభవమూ,ఆలోచనలూ అందరితో పంచుకొని,స్వీయ రచనాపఠనంతో మీ ప్రజ్ఞాపాటవాలు నలుగురికీ తెలిసే అవకాశం కల్పించండి.వీటితోపాటు,తెలుగు నేర్చుకుంటున్న ఇక్కడిపిల్లలు సమర్పించే సాంస్కృతికకార్యక్రమంకూడా వుంటుంది. చూసి ప్రోత్సహించండి. మీ పిల్లలుగాని,మనుమలుగాని పాల్గొనదలిస్తే మా కార్య నిర్వాహకులను సంప్రదించండి. విందుభోజనం సరేసరి!

సదస్సుకు ముందుగానే మీపేరు నమోదుచేసుకుంటే సూచించబడినచందాలో కొంత ఆదాఅవుతుంది. ఎడంవైపు దృష్టిమరల్చండి ! వివరాలకు కరపత్రం చదవండి.

 

2010 Bikes Program

Beneficiaries

This We Believe ..

This we believe ..

 నిత్యావసరాల కోసం
పెనుగులాడాల్సిన వాళ్ళు
కృత్యాకృత్య మీమాంసతో
పెనుగులాడ లేని వాళ్ళు
 

.. we are sure you do too.

You are here  : Home Events

గుడి కట్ట చందాలు ఘనముగా చదివించి
బళ్ళాసుపత్రులనగనే పెడమొగము చూపించు
ధనిక ప్రవాసులన్, వార్లనేమనగ వలెను?
మోకాళ్ళలో హెడ్లు, మోస్ట్ పిటిఫుల్ గొడ్లు